సీ|| నింబవృక్షఛాయ నిండుగా కొలువుండి
భక్తజనుల కాచు భవ్యరూప !
అభయముద్రను దాల్చి ఆశ్రయించినవారి
ఆపద తొలగించు అమృతహృదయ !
దారిద్ర్యమును బాపి ధనదాన్యములనిచ్చి
దీనులను పోషించు దివ్యభావ !
అజ్ఞానతిమిరంబునంతంబుసేయగా
విజ్ఞానప్రభలిచ్చు విబుధవరుడ !
తే|| ఈతిబాధలు తొలగించు చేతితోడ
భూతతతినెల్ల గాచెడి భూతనాధ !
సాధుమానససంచార ! సత్యరూప !
సాయిమహరాజ ! నను వేగ సాకుమయ్య !
సీ|| వేదాంతవేద్యుడై విమలాంతరంగుడై
ఖ్యాతి నొందిన సాయి కాంతిమయుడు!
షిరిడీ పురీశుడై శ్రీదత్త రూపుడై
సన్నుతిం గొను సాయి సర్వమయుడు!
కాషాయధారియై కరుణాంతరంగుడై
కనిపించు శ్రీసాయి కలుషహరుడు!
తే|| ఆర్తపోషకుడౌ సాయి అమృతకరుడు!
సాధు రక్షకుడౌ సాయి సత్యగురుడు!
భూతిదాయకుడౌ సాయి భూతహితుడు!
చిత్తసంవాసుడౌ సాయి శ్రీకరుండు!
కం|| ' బాబా'! రమ్మని పిలచిన
'బాబూ! వచ్చితి' ననుచును పలికెడి సామీ!
నా బాగోగులు జూచుట
నీ బాధ్యత యౌను గాదె నిర్మలహృదయా!
కం|| నీ నామము సుందరమట
నీ నామమె వేదమంత్ర నిచయంబట, నీ
ధ్యాన మె నిరుపమ తపమట
నీ నిల నీ వాడ ననుట నిక్కము సాయీ !
కం|| వేధించెడి భవము విడచి
సాధించగ మోక్షపథము చక్కని విద్యల్
బోధించేడి గురుదేవా!
శోధించకు మయ్య నన్ను సుందర సాయీ!
సీ|| వేదాంతవేద్యుడై విమలాంతరంగుడై
వినుతులందెడు సాయి విశ్వవిభుడు!
సన్మార్గ ద్రష్టయై సత్యోపదిష్టయై ఖ్యాతి నొందిన సాయి కాంతిమయుడు!
షిరిడీ పురీశుడై శ్రీదత్త రూపుడై
సన్నుతిం గొను సాయి సర్వమయుడు!
కాషాయధారియై కరుణాంతరంగుడై
కనిపించు శ్రీసాయి కలుషహరుడు!
తే|| ఆర్తపోషకుడౌ సాయి అమృతకరుడు!
సాధు రక్షకుడౌ సాయి సత్యగురుడు!
భూతిదాయకుడౌ సాయి భూతహితుడు!
చిత్తసంవాసుడౌ సాయి శ్రీకరుండు!
కం|| ' బాబా'! రమ్మని పిలచిన
'బాబూ! వచ్చితి' ననుచును పలికెడి సామీ!
నా బాగోగులు జూచుట
నీ బాధ్యత యౌను గాదె నిర్మలహృదయా!
కం|| నీ నామము సుందరమట
నీ నామమె వేదమంత్ర నిచయంబట, నీ
ధ్యాన మె నిరుపమ తపమట
నీ నిల నీ వాడ ననుట నిక్కము సాయీ !
కం|| వేధించెడి భవము విడచి
సాధించగ మోక్షపథము చక్కని విద్యల్
బోధించేడి గురుదేవా!
శోధించకు మయ్య నన్ను సుందర సాయీ!